ఆ తేదీలు దాటితే డిజిటల్‌ వైపే.. - sooryavanshi and 83 may release in digital platform
close
Published : 25/08/2020 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ తేదీలు దాటితే డిజిటల్‌ వైపే..

కరోనా ప్రభావంతో థియేటర్‌లు అన్నీ మూతపడ్డాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్‌ల్లోకి అడుగుపెట్టే రోజు ఎప్పుడో అనే విషయంలోనూ ఎవరికీ స్పష్టత లేదు. దీంతో చాలావరకూ సినిమాలు డిజిటల్‌ బాట పట్టాయి. ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ కొన్ని భారీ చిత్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే హిందీలో తెరకెక్కిన భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’లను దీపావళికి కానీ క్రిస్మస్‌కి కానీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ పరిస్థితులు చక్కబడకపోతే ఏంటి? అనేదానిపై ఈ రెండు చిత్రాలను నిర్మించిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి ఆ సంస్థ సీఈవో శిభాషిస్‌ సర్కార్‌ స్పందించారు.

‘‘మేము వందశాతం థియేటర్‌లోనే మా చిత్రాలను విడుదల చేయాలనుకుంటున్నాం. అది ఎంతవరకూ సాధ్యమో అంతవరకే ఆగుతాం. అంటే దీపావళి లేదంటే క్రిస్మస్‌ తేదీలను దాటి ఇంక ఆలస్యం చేయలేం. థియేటర్లు తెరవకపోయినా..కరోనా అదుపులోకి రాకపోయినా, కొన్ని రాష్ట్రాలు థియేటర్లు తెరిచి, కొన్ని రాష్ట్రాలు తెరవక.. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పకుండా డిజిటల్‌ వైపు వెళ్లడానికి ఉన్న మార్గాలన్నీ చూస్తున్నాం. వీడియో ఆన్‌ డిమాండ్, పే పర్‌ వ్యూ లేదంటే సగం థియేటర్, సగం పే పర్‌ వ్యూ...ఇలా రకరకాల మార్గాల గురించి ఆలోచిస్తున్నాం. అంతేకానీ ఆ తేదీలను దాటైతే విడుదలను వాయిదా వేయలేం’’అని చెప్పారు.

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి ‘సూర్యవంశీ’ని తెరకెక్కించారు. 1983 భారత్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన నేపథ్యంతో రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో ‘83’ని తీర్చిదిద్దారు దర్శకుడు కబీర్‌ఖాన్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని