సారీ.. అవి కరోనా టీకాలు అని తెలియదు! - sorry i didnot know it was medicine for corona treatment theif said in a note
close
Updated : 23/04/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సారీ.. అవి కరోనా టీకాలు అని తెలియదు!

ఎత్తుకెళ్లిన వ్యాక్సిన్లను తిరిగిచ్చేసిన దొంగ

ఛండీగఢ్‌‌: హరియాణాలోని జింద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 1,700 వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగ వాటిని తిరిగిచ్చేశాడు. ఓవైపు కరోనా రెండో వేవ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కరోనా టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జింద్‌లోని ఆసుపత్రిలో వ్యాక్సిన్లు దొంగతనానికి గురికావడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే సదరు దొంగ జింద్‌లోని సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా టీ కొట్టులో ఉన్న ఓ వ్యక్తికి వ్యాక్సిన్ల పెట్టెను ఇచ్చాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పనిఉండటంతో ఆ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

పోలీసులు ఆ పెట్టెను తెరవగా వారికి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. ‘‘ క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’’ అని రాశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని