దక్షిణకొరియా ఫైటర్‌తో పోరాటాలు? - south korean fighter for salman radhe movie
close
Published : 16/10/2020 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణకొరియా ఫైటర్‌తో పోరాటాలు?

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ సినిమా అంటే యాక్షన్‌ ఘట్టాలకు ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. అలాంటిది ఆయన పోషించేది పోలీస్‌ పాత్రయితే ఆ మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆయన నటిస్తున్న పోలీస్‌ చిత్రం ‘రాధే: ది మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే సల్మాన్‌ ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా రణ్‌దీప్‌ హుడా నటిస్తున్నాడు. సల్మాన్‌, రణ్‌దీప్‌ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు చిత్రంలో కీలకమైనవట. అందుకే ఇందులో ఫైటింగ్స్‌ కోసం దక్షిణకొరియాకు చెందిన స్టంట్‌ మ్యాన్‌, నటుడు కోన్‌ టే హో పనిచేయబోతున్నట్టు సమాచారం. ఫైట్‌ను కంపోజ్‌ చేయడమే కాదు కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో కోన్‌ టే హో నటిస్తాడని సమాచారం.  ఈ చిత్రంలో దిశాపటాని నాయిక. ఇటీవలే ఆమె కూడా చిత్రీకరణలో పాల్గొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని