ప్రత్యేక అనుమతితో ‘అన్నాత్తే’ షూటింగ్‌  - special permission granted rajinikanth annaatthe shoot in hyderabad
close
Published : 23/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రత్యేక అనుమతితో ‘అన్నాత్తే’ షూటింగ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ విధించింది. ‘అన్నాత్తే’ సినిమా వారం పాటు నైట్ షెడ్యూల్లో షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో చిత్రబృందం రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ పోలీసుల నుంచి రాత్రి పూట షూటింగ్‌ జరుపుకోవడానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లు సమాచారం. సినిమా చిత్రీకరణ కొవిడ్‌ నిబంధనల ప్రకారం షూటింగ్‌ జరుపుకోనుంది. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇందులో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ,  ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 4, 2021 దీపావళికి  ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని