close

తాజా వార్తలు

ఖాకీకే ఓటు.. కొడతారా హిట్టు..!

వెండితెరపై పవర్‌ఫుల్‌గా..

అభిమాన హీరో పోలీసుగా, దేశ సరిహద్దుల్లో ప్రజల సంరక్షణ కోసం కష్టపడే ఆర్మీ అధికారిగా కనిపిస్తే ఆ కిక్కే వేరు. ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకున్న దర్శక, నిర్మాతలు ఇప్పుడు అలాంటి కథల్ని సిద్ధం చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకులు కూడా సై అనడంతో ఎంచక్కా సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే అనేక సినిమాలొచ్చి.. అలరించాయి. త్వరలో మరికొందరు పవర్‌ఫుల్‌ పోలీసు, ఆర్మీ అధికారులు వెండితెరపై జిగేలు మనబోతున్నారు. డిసెంబరు 13న వచ్చిన ‘వెంకీ మామ’లో నాగచైతన్య ఆర్మీ ఆఫీసరుగా ఆకట్టుకున్నారు. ఈ వరుసలోని మరికొందరు కథానాయకుల జాబితా చూద్దాం...

రౌడీ ఇన్‌స్పెక్టర్‌, లక్ష్మీ నరసింహా, చెన్న కేశవరెడ్డి.. తదితర సినిమాల్లో బాలయ్య పోలీస్‌గా అలరించారు. పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, యాక్షన్‌తో అభిమానులతో విజిల్స్‌ వేయించారు. ఆయన ‘రూలర్‌’లో ధర్మగా మరోసారి వెండితెరపై మెరవనున్నారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య వివిధ గెటప్‌లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్టైలిష్‌గా కనిపిస్తునే మరోవైపు మాస్‌ పోలీస్‌గానూ బాలయ్య సందడి చేస్తున్నారు. అయితే, ఆయన ఎన్ని పాత్రలు పోషిస్తున్నారన్న విషయం తెలియాలంటే డిసెంబరు 20 వరకూ వేచి చూడాల్సిందే.

హేశ్‌బాబు ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు వంటి సినిమాల్లో పోలీసు ఆఫీసర్‌గా కనిపించి సందడి చేశారు. ఆయన నటన ప్రేక్షకులకు నచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం తొలిసారి మహేశ్‌ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నారు. మరి ఈ సరికొత్త అవతారంలో సూపర్‌స్టార్‌ ఎలా అలరించబోతున్నారో తెలియాలంటే 2020 జనవరి 11 వరకు ఆగాల్సిందే.

బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ మరోసారి పోలీసు గెటప్‌ వేశారు. ‘దబాంగ్‌’కు కొనసాగింపుగా వస్తున్న ‘దబాంగ్‌ 3’లో చుల్‌బుల్‌ పాండేగా హంగామా చేయనున్నారు. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా కథానాయిక. సుదీప్‌ ప్రతినాయకుడు. ఇందులోనూ సల్మాన్‌ తనదైన స్టైల్‌, యాక్షన్‌తో అభిమానులకు వినోదం పంచనున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాల్ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమాను హిందీతోపాటు వివిధ దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఇది కూడా క్రిస్మస్‌ కానుగా  డిసెంబరు 20న థియేటర్‌లలో ఫ్యాన్స్‌తో కేకలు పెట్టించనుంది.

ల్లలులేని అభిమానులను సొంతం చేసుకున్న స్టార్‌ రజనీకాంత్. ఆయన పోలీస్‌గా నటిస్తున్న చిత్రం ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ సినిమాలో తలైవా మరోసారి అరుణాచలం పాత్రలో సందడి చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం రజనీ కెరీర్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే అనేక సినిమాల్లో రజనీ పోలీసుగా కనిపించి, ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

వితేజ మరోసారి పోలీస్‌గా అలరించనున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయిక. కోర మీసాలతో రవితేజ సీరియస్‌ లుక్‌ను చిత్ర బృందం ఇటీవల పంచుకుంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల కాబోతోందట. ‘విక్రమార్కుడు’, ‘పవర్‌’, ‘మిరపకాయ్‌’, ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాల్లో  పోలీసుగా కనిపించి మెప్పించిన ఆయన ఇందులో ఏ తరహాలో ఉంటారో చూడాలి.

ప్పటికే అనేకసార్లు పోలీస్‌  ఆఫీసర్‌గా కనిపించి, ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించారు అజిత్‌. ఇప్పుడు మరోమారు ఆయన అదే తరహా పాత్రలో నటిస్తున్నారట. హెచ్‌.వినోత్‌ దర్శకత్వంలో అజిత్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన కారు రేసర్‌గా నటిస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ పోలీసు అధికారిగా కూడా కనిపిస్తారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగా అజిత్‌ శరీరాన్ని ఫిట్‌గా మారుతున్నట్లు సమాచారం. గతంలో ఆంజనేయ, మంగాత్తా, ఎన్నై అరిందాల్‌ వంటి చిత్రాల్లో అజిత్‌ పోలీసుగా నటించారు. ఇప్పుడు మళ్లీ ఖాకీ దుస్తులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.