హీరోలకేం తీసిపోరు..భారం మోస్తున్నారు!
కథానాయికంటే హీరో పక్కన మెరిసే తార.. అనే లెక్క రోజురోజుకూ మారిపోతోంది. హీరోలకు ఏ మాత్రం తీసుపోమంటూ ముద్దుగుమ్మలు కూడా తమ భుజాలపై సినిమా భారం మోస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కాసులు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ కోవలో వచ్చిన అనేక సినిమాలు విజయాలు సాధించాయి. మహిళలు కూడా సింగిల్ హ్యాండ్‌తో సినిమాను ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకుల్లో తమ సినిమాలంటే ఓ మార్క్ ఏర్పరచుకుంటున్నారు. త్వరలో మహిళా ప్రాధాన్యం ఉన్న అనేక సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న అనుష్క ఆచితూచి సినిమాల్ని ఎంచుకుంటున్నారు. ‘బాహుబలి’తో ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించినప్పటికీ నచ్చిన స్క్రిప్టులను మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ‘భాగమతి’ (2018)తో హిట్ కొట్టిన తర్వాత ‘నిశ్శబ్దం’కి సంతకం చేశారు. ఇందులో స్వీటీ దివ్యాంగురాలిగా నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంతో అనుష్క కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పబోతోందో చూడాలి.
‘మహానటి’తో కీర్తి సురేశ్ తొలినాళ్లలోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇటీవల ఆమె మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సంతకం చేశారు. వాటిలో తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సమర్పణలో చేస్తున్న సినిమా ‘పెంగ్విన్’. ఇటీవల ఫస్ట్‌లుక్ వచ్చింది. అదేవిధంగా ‘మిస్ ఇండియా’ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. నాగేంద్ర నాథ్ దర్శకుడు. ‘గుడ్‌లక్ సఖి’ అనే సినిమాలోనూ కీర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుతుపున్నారు. ఈ సినిమాల అప్డేట్స్ అధికారికంగా రావాల్సి ఉంది.
లేడీ సూపర్‌స్టార్‌గా కోట్లాది ప్రజల మన్ననలు పొందుతున్న నయనతార ఇప్పటికే అనేక కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి మెప్పించారు. ఇటు హీరోల సరసన నటిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఆమె ఇటీవల మరో సినిమాకు సంతకం చేశారు. ‘నెట్రికన్’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాకు మిలింద్ రా దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటిస్తున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమా కోసం కంగన గత కొన్ని నెలలుగా చాలా కష్టపడుతున్నారు. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద స్వామి కనిపించనున్నారు. ఆయన ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఇదే చిత్రంలో శశికళగా ప్రియమణిగా, శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ, కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ నటించబోతున్నారట. ఇలా భారీ తారాగణంతో వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది జూన్ 26న ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో రాబోతోంది.
మరోపక్క అగ్ర కథానాయిక త్రిష జోరుమీదున్నారు. ‘పేట’ తర్వాత ఆమె మూడు కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు సంతకం చేశారు. ఈ సినిమా షూటింగ్‌లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ‘పరమపదం విలయత్తు’, ‘గర్జనై’, ‘రంగీ’ సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. ‘పరమపదం విలయత్తు’ ఈ నెల 31న రాబోతోంది. ఇందులో త్రిష డాక్టర్ గాయత్రిగా నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.
ముద్దుగుమ్మ ఆలియా భట్ తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. ముంబయికి చెందిన రౌడీ రాణి గంగూబాయ్ కతియావాడి జీవితం ఆధారంగా తీస్తున్న ‘గంగూబాయ్ కతియావాడి’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. గంగూబాయ్ అంటే అందరూ వణికిపోయేవారు. ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామాటిపుర’గా పిలిచేవారు. చిన్నతనంలోనే ఇంట్లోని వారు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించడంతో ఆమె చాలాకాలం పాటు అదే వృత్తిలో కొనసాగారు, రౌడీరాణిగా ఎదిగారు. ఈ కథాంశంతో తీస్తున్న సినిమాలో ఆలియా లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ప్రచార చిత్రం అంచనాలు పెంచింది.
శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ నటిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రానికి సంతకం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో యుద్ధవిమానం నడిపిన తొలి పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథతో తీస్తున్న ‘గుంజన్ సక్సేనా’లో నటిస్తున్నారు. శరణ్ శర్మ దర్శకుడు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 13న విడుదల కానుంది. ఈ సినిమా ఆమె కెరీర్లో ఎలాంటి స్థానం దక్కించుకోనుందో చూడాలి.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
మరిన్ని
కొత్త సినిమాలు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
గుసగుసలు
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్