మోస్ట్‌ వెయిటెడ్‌ వీడియో ఆగయా! - special video song from uppena out now
close
Updated : 19/03/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోస్ట్‌ వెయిటెడ్‌ వీడియో ఆగయా!

ఫిదా అవుతోన్న నెటిజన్లు

హైదరాబాద్‌: సినీ ప్రియులందరికీ ‘ఉప్పెన’ టీమ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జలజల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌ని తాజాగా విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్ జాజ్ గాత్రం తోడవడంతో సినిమా విడుదలకు ముందే ఈ పాటకు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మెలోడికి సంబంధించిన పూర్తి‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిల హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ పాటను విడుదల చేసిన కొద్దిసేపటికే 32 లక్షల మంది వీక్షించారు. అలాగే 1.55 లక్షల మంది లైక్‌ చేశారు.

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని