స్పైస్‌జెట్‌ విమానంపై సోనూసూద్ ఫొటో.. - spicejet honours actor sonu sood by dedicating special airline livery
close
Updated : 20/03/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పైస్‌జెట్‌ విమానంపై సోనూసూద్ ఫొటో..

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌కు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. ‘ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్‌’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.

స్పైస్‌జెట్‌ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని తెలిపారు. సోనూకు దక్కిన గౌరవం పట్ల నటి కాజల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సేవల్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు, విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్పైస్‌జెట్‌తో కలిసి 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు తీసుకువచ్చారు. ఇలా ఎన్నో విధాలుగా సోనూ చేసిన సేవల పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని