SR Kalyanamandapam: ఓటీటీలో ఎస్‌ఆర్‌ కల్యాణమండపం వచ్చేస్తోంది! - sr kalyanamandapam will release on aha soon
close
Published : 17/08/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SR Kalyanamandapam: ఓటీటీలో ఎస్‌ఆర్‌ కల్యాణమండపం వచ్చేస్తోంది!

హైదరాబాద్‌: కిర‌ణ్ అబ్బవ‌రం, సాయికుమార్‌, ప్రియాంక జ‌వాల్కర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం. శ్రీధ‌ర్ గాదే దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. తన తాత కట్టిన ఎస్‌.ఆర్.క‌ళ్యాణ‌మండపానికి పూర్వవైభ‌వం తీసుకొచ్చేందుకు క‌ళ్యాణ్‌ అనే యువకుడు ఏం చేశాడన్నదే ఈ చిత్రకథ.  తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో పాటు, యువతను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దిన విధానం మెప్పించింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ‘ఆహా’ వేదికగా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ విడుదల కానుంది. ‘‘తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం SR కళ్యాణ మండపం అతి త్వరలో మీ ఆహాలో విడుదలవబోతుంది. సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్‌ చేసింది. అయితే, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుందనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని