Cinema News: మేము సిద్ధమే కానీ.. - sr kalyanmadapam will release in theaters only
close
Published : 28/05/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: మేము సిద్ధమే కానీ..

హైదరాబాద్‌: తమ సినిమా సిద్ధమయ్యిందని.. కాకపోతే ప్రేక్షకుల ముందుకు రావడానికి కొంత సమయం పడుతుందని అంటోంది ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ బృందం. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్‌ గాడె దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఈ నేల తడబడే వరాల ఒరవడే’ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించిన విషయం తెలిసిందే.

కాగా, కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా గత కొన్నిరోజుల నుంచి థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు చిత్రాల విడుదల గురించి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయా చిత్రబృందాలు తమ సినిమా విడుదల గురించి ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నారు. తాజాగా ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు సదరు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టింది. ‘మా సినిమా సిద్ధమయ్యింది. థియేటర్లు మాకోసం ఎదురు చూస్తున్నాయి. మరి మీ సంగతేమిటి? మా చిత్రం మీ సమీప థియేటర్లలోనే విడుదల కానుంది. ఫుల్‌ ఫన్‌ని ఆస్వాదించడానికి సిద్ధంకండి!!’ అని చిత్రబృందం పేర్కొంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని