భాజపాలోకి మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌! - sreedharan to join bjp
close
Updated : 18/02/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాలోకి మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌!

దిల్లీ: భారత్‌లో మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. త్వరలోనే ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది. కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీధరన్‌ భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళలో ఈ ఆదివారం భాజపా నిర్వహిస్తోన్న విజయ్‌ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. 88ఏళ్ల వయసున్న ఈ మెట్రోమ్యాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భాజపాలో చేరే విషయంపై శ్రీధరన్‌ ఇటీవలే పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. అంతేకాకుండా పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు. దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్‌కు ఉంది. ఆయన 2011లో దిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని