‘రైతు.. తన కొడుకుని రైతును చేయడం లేదు’ - sreekaram​ teaser sharwanand priyanka arul mohan
close
Published : 09/02/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రైతు.. తన కొడుకుని రైతును చేయడం లేదు’

మనసుకు హత్తుకునేలా ‘శ్రీకారం’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ వినూత్నమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ హీరోగా పేరున్న శర్వా మరోసారి కుటుంబ కథా చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బి.కిశోర్‌ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఆమని, రావురమేశ్‌, సాయికుమార్‌, మురళీశర్మ, నరేశ్‌, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందించారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై  రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన పాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి విషెస్ చెప్పారు.

ఆ టీజర్‌లో ‘ఒక హీరో తన కొడుకుని హీరోని చేస్తున్నాడు. ఒక డాక్టర్‌ తన కొడుకుని డాక్టర్‌ను చేస్తున్నాడు. ఒక ఇంజినీర్‌ తన కొడుకుని ఇంజినీర్‌ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం తన కొడుకుని రైతును చేయడం లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. తినేవాళ్లు మన నెత్తిమీద జుట్టంతా ఉంటే పండించేవాళ్లు మూతి మీద మీసమంత కూడా లేరు’ అంటూ రైతుల గురించి హీరో చెప్పే డైలాగ్‌లు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఆలస్యమెందుకు మీరూ టీజర్‌ చూసేయండి మరి.
ఇదీ చదవండి..

నా నటన చూసి ఏడ్చేశారు: కృతి శెట్టి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని