మంచి సందేశం ఇచ్చే చిత్రమే ‘శ్రీకారం’: చిరంజీవి - sreekaram pre release chiranjeevi sharwanand priyanka
close
Published : 08/03/2021 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచి సందేశం ఇచ్చే చిత్రమే ‘శ్రీకారం’: చిరంజీవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవసాయం గొప్పదనం అందరికీ చెప్పేందుకు.. సరైన సమయంలో వస్తున్న సినిమా ‘శ్రీకారం’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ‘శ్రీకారం’ ప్రిరిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శర్వానంద్ హీరోగా కిశోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఖమ్మంలో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.. ‘‘మాకు మరో రామ్‌చరణ్‌.. శర్వానంద్‌. మా ఇంట్లోవాడిగా మాతో కలిసిపోతాడు. అదే క్రమంలో ఒకసారి అతడితో ప్రకటనలో చేయించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో కూడా చేశాడు. అలా అతడి నటనకు తిలకం దిద్దే అవకాశం నాకు వచ్చింది. ‘శ్రీకారం’లో అద్భుతంగా నటించాడు. ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది. డైరెక్టర్‌ కిషోర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నా. వ్యవసాయం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నమే ఈ ‘శ్రీకారం’. రావాల్సిన సమయంలోనే ఈ సినిమా వచ్చిందని భావిస్తున్నా. సినిమాకు అందరూ ఎంతో మనసు పెట్టి పని చేశారు. కమర్షియల్‌ అందాలను జోడించి తీర్చిదిద్దిన మంచి చిత్రం ఇది. చివరగా నా బిడ్డ శర్వానంద్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని ఆయన ముగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని