రైతుకు సాయం తక్కువై.. వ్యయం ఎక్కువైంది - sreekaram pre release ktr sharwanand priyanka
close
Published : 09/03/2021 23:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుకు సాయం తక్కువై.. వ్యయం ఎక్కువైంది

‘శ్రీకారం’ ప్రిరిలీజ్‌ వేడుకలో మంత్రి కేటీఆర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సాయం తక్కువై.. వ్యయం ఎక్కువైపోయిందని, అలాంటి రైతుల గురించి తీసిన ‘శ్రీకారం’ గుండెను తాకే సినిమాగా నిలిచిపోవాలని మనసారా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘శ్రీకారం’ ప్రిరిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శర్వానంద్ హీరోగా కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో గ్రాండ్‌ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ఈ వేడుకకు నన్ను ఆహ్వానించిన శర్వానంద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘ఎద్దేడ్చిన వ్యవసాయం.. రైతేడ్చిన రాజ్యం బాగుండదు’ అంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు సాయం తక్కువైంది.. వ్యయం పెరిగిపోయింది. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి రైతులకు అండగా నిలవాలన్న మంచి ఉద్దేశంతో వచ్చిన సినిమా ఇది. టీజర్‌ వీడియో నాకు పంపించారు. నాకు బాగా నచ్చింది. డైరెక్టర్‌ కిశోర్‌ మనసు పెట్టి ఈ సినిమా చేసినట్లు అర్థమవుతోంది. గుండెను తాకి ఆత్మకు సంతృప్తినిచ్చే సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నా. నేను కూడా సినిమాలు బాగా చూస్తాను. ప్రస్థానం, గమ్యం, పడిపడిలేచె మనసు.. ఇలా శర్వానంద్‌ భిన్నమైన సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమా మీరు అనుకున్నదానికంటే.. పెద్ద విజయం సాధిస్తుంది. మంచి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉంది. మీరు చూసి ఇంకో పదిమందికి చూపించాలని మీ అందర్నీ కోరుతున్నా. రైతులకు ఈ దేశంలో మంచి భవిష్యత్‌ ఉందని చాటిచెప్పాలి. జై జవాన్‌.. జై కిసాన్‌’’ అని కేటీఆర్ ముగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని