మార్చి 11న విడుదలకు ‘శ్రీకారం’ - sreekaram will hit screens on march 11
close
Published : 24/01/2021 03:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి 11న విడుదలకు ‘శ్రీకారం’

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ జోరు పెంచింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దర్శక-నిర్మాతలు వరుసగా సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మరో సినిమా.. థియేటర్‌ తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమైంది. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ‘శ్రీకారం’ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను బి.కిశోర్‌ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. శర్వానంద్‌ సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా ఆడిపాడింది. ఆమని, రావురమేశ్‌, సాయికుమార్‌, మురళీశర్మ, నరేశ్‌, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందించారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై  రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన పాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి..

కొవిడ్‌: మొదటి 2 రోజులు ఇబ్బందిపడ్డాం: ఉపాసన
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని