INDvsSL: శ్రీలంకతో మ్యాచ్‌లు.. సమయ మార్పులు - sri lanka announced new timings for india vs srilanka limited over series
close
Published : 13/07/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsSL: శ్రీలంకతో మ్యాచ్‌లు.. సమయ మార్పులు

(Photo: SLC Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్వల్ప సమయ మార్పులు చేసినట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్డేలను అరగంట, 25 నుంచి ప్రారంభమయ్యే టీ20లను గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశం చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు తిరిగి 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లంక బోర్డు ఆయా మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాలి. ఇప్పుడవి మధ్యాహ్నం 3, రాత్రి 8 గంటలకు మారాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని