గడ్డం తగ్గించి పనిలో దిగాలి - srk to resume shoot for pathan by sharing picture on social media
close
Published : 13/06/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గడ్డం తగ్గించి పనిలో దిగాలి

ముంబయి: షారుఖ్‌ఖాన్‌ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు పండగ చేసుకుంటారు. ఆయనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. కానీ ఆయన నుంచి సినిమా వచ్చి సుమారు మూడేళ్లు అయిపోయింది. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించడం మినహా ఆయన నుంచి అభిమానులకు తీపి కబుర్లు ఏమీ ఉండటం లేదు. తాజాగా అభిమానుల కోసం ఓ సెల్ఫీని పంచుకున్నారు షారుఖ్‌. ‘‘సమయాన్ని రోజులు, నెలలుతో పాటు గడ్డంతోనూ కొలుస్తారని చెబుతుంటారు. గడ్డం తగ్గించి పనిలో దిగే సమయం వచ్చిందనుకుంటున్నా. ముందున్నవన్నీ మంచి రోజులే కాదు చేయాల్సిన పని కూడా ఎదురుచూస్తోంది’’అని ట్వీట్‌ చేశారు. షారుఖ్‌ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే ఆయన ‘పఠాన్‌’ చిత్రీకరణ కోసం సెట్లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని