సలార్: శ్రుతిహాసన్‌ ఫిక్స్‌..! - sruthi haasan in salaar movie
close
Updated : 28/01/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సలార్: శ్రుతిహాసన్‌ ఫిక్స్‌..!

అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా రానున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రుతిహాసన్‌కు అవకాశం దక్కింది. ‘సలార్‌’ టీమ్‌లోకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ చిత్రబృందం తాజాగా ఓ పోస్ట్‌ చేసింది. గురువారం శ్రుతి పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‌’ టీమ్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘ఎంతో అందమైన శ్రుతిహాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘సలార్‌’ చిత్రంలో మీరు కూడా భాగమైనందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గోదావరిఖనిలో భారీసెట్‌ వేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

ఇదీ చదవండి

స్టార్‌హీరో పెళ్లిపై నటి వైరల్‌ కామెంట్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని