హైదరాబాద్: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి శ్రుతిహాసన్. ‘క్రాక్’తో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. కాగా, తాజాగా శ్రుతిహాసన్ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శ్రుతి.. సూటిగా సమాధానమిచ్చారు.
ఇందులో భాగంగా ఓ అభిమాని.. ‘మానసికంగా మిమ్మల్ని ఎంతో బాధకు గురిచేసిన మీ మాజీ ప్రియుడు మైకేల్‌ను మీరు ద్వేషిస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఎవర్నీ ద్వేషించను. అతనితో నాకు ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి.’ అని తెలిపారు. మరో అభిమాని.. ‘ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోనున్నారా?’ అని అడగ్గా.. లేదని చెప్పారు. అనంతరం మరో నెటిజన్.. ‘బిజీగా ఉండడం వల్లే ‘క్రాక్’ ప్రమోషన్స్‌లో మీరు పాల్గొనలేదా?’ అని ప్రశ్నించగా.. ‘అవును. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై నాకు సరైన సమాచారం లేదు. ప్రమోషన్స్‌లో పాల్గొనాలని ఎంతో ఆశగా ఎదురుచూశాను. కానీ అదే సమయంలో వేరే ప్రాజెక్ట్ పనుల్లో కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది.’ అని శ్రుతిహాసన్ వివరించారు.
ఇదీ చదవండి
నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’