రవితేజ.. నాకెంతో స్పెషల్‌: శ్రుతిహాసన్‌ - sruthihaasan about her costars
close
Published : 18/02/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ.. నాకెంతో స్పెషల్‌: శ్రుతిహాసన్‌

టాలీవుడ్‌ హీరోల గురించి నటి ఏమన్నారంటే

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ తనకెంతో ప్రత్యేకమని కథానాయిక శ్రుతిహాసన్‌ అన్నారు. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘క్రాక్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఆమె కీలకపాత్రలో నటించిన ‘పిట్టకథలు’ వెబ్‌సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న విడుదల కానుంది. హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘లస్ట్‌ స్టోరీస్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ తెరకెక్కింది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఓ కథలో ఆమె నటించారు. మరో కొన్ని గంటల్లో ‘పిట్టకథలు’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రుతిహాసన్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌ హీరోలతో స్ర్కీన్‌ పంచుకోవడంపై ఆమె స్పందించారు.

‘‘అల్లుఅర్జున్‌తో కలిసి నేను ‘రేసుగుర్రం’లో నటించాను. వృత్తిపట్ల ఆయన అంకితభావంతో పనిచేస్తారు. అలాగే అవసరమైన దానికంటే అదనంగా కష్టపడుతుంటారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ విషయానికి వస్తే ఆయన ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. గ్రేస్‌ఫుల్‌. ఆయనతో కలిసి స్ర్కీన్‌ పంచుకునే అవకాశం రావడం నా అదృష్టం. ఇక, రవితేజ గురించి చెప్పాలంటే ఆయన నాకెంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో కలిసి ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలు నటించాను. కెరీర్‌ ఆరంభంలో ‘బలుపు’ కోసం ఆయనతో పనిచేస్తున్న సమయంలో నాకెంతో సపోర్ట్‌ చేశారు. సీనియర్‌ నటుడనే అహంభావం ఆయనలో ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే నా హృదయంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’ అని శ్రుతి హాసన్‌ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని