భారత్‌కు అండగా నిలుస్తాం: చైనా  - stand with india on covid will provide full support: chinese minister wang yi
close
Published : 01/06/2021 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌కు అండగా నిలుస్తాం: చైనా 

దిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అధ్యక్షతన బ్రిక్స్‌ సభ్యదేశాల 15వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ.. కరోనాతో పోరాడుతున్న భారత దేశానికి అండగా నిలుస్తామని, తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా వాంగ్‌ యీ మాట్లాడుతూ ‘‘సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌తో పోరాడుతున్న భారత్‌కు సానుభూతిని తెలుపుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా బ్రిక్స్ దేశాలకు అండగా నిలుస్తుంది. చైనాతో సహా బ్రిక్స్‌ సభ్యదేశాలన్నీ భారత్‌కు సాయం చేస్తాయి. త్వరలోనే భారత్‌ కరోనా మహమ్మారిని జయిస్తుందన్న నమ్మకం మాకు ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశంలో వాంగ్‌ యీతో పాటు బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి కార్లోస్‌ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి గ్రేస్‌ నలేడి మండిసా పాండోర్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహమే బ్రిక్స్‌. దీన్ని 2006లో ప్రారంభించారు. సభ్యదేశాల మధ్య శాంతి, భద్రత, అభివృద్ధి, సహకారాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా బ్రిక్స్ యంత్రాంగం పనిచేస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని