Latest Telugu News, Headlines, Breaking News, Articles
close
Updated : 20/03/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టార్‌ డైరెక్టర్లు‌, హీరోలు.. అందరూ ఒకేచోట

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, దర్శకులు అందరూ ఒకేచోట కలిశారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఇలాంటి సంతోషకరమైన కార్యక్రమానికి ‘సెలబ్రేటింగ్‌ ఉప్పెన’ వేదికైంది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ విభిన్న ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ‘ఉప్పెన’ విజయోత్సవాలను నిర్వహించింది.

‘సెలబ్రేటింగ్‌ ఉప్పెన’ పేరుతో హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, సుకుమార్‌, గోపీచంద్‌ మలినేని, హరీశ్‌ శంకర్, వేణు శ్రీరామ్‌, దిల్‌ రాజు, ప్రసాద్‌ పొట్లూరి తదితరులు పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు, చిరంజీవి, అల్లు అర్జున్‌, గోపీచంద్‌ మలినేని తమ తదుపరి చిత్రాలను మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై చేస్తున్నారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని