ఆమిర్‌ఖాన్‌కు కరోనా - star hero aamir khan tests positive
close
Updated : 24/03/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమిర్‌ఖాన్‌కు కరోనా

ముంబయి: బాలీవుడ్ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆమిర్‌ కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని ఆయన‌ సన్నిహితులు వెల్లడించారు. అంతేకాకుండా సిబ్బందిని సైతం ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. నానాటీకి కొత్త కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌లు సైతం ఇటీవల కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్‌ నటుడు అషిశ్‌ విద్యార్థి, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలి సైతం ఇటీవల కరోనా భారిన పడిన వారే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని