అంకురాలూ.. ఆ పనిచేయండి - startups .. Do that
close
Published : 04/09/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకురాలూ.. ఆ పనిచేయండి

ఉద్యోగులకిచ్చే షేర్లపై చర్చాపత్రంతో రండి
వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయెల్‌

దిల్లీ: ఉద్యోగులకిచ్చే షేర్ల (ఇసాప్స్‌) విషయంలో ఒక సంపూర్ణ చర్చాపత్రంతో ముందుకు రావాలని అంకురాలకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూశ్‌ గోయెల్‌ పిలుపునిచ్చారు. ఆ అంశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని ఆయన అన్నారు. అక్టోబరు లేదా నవంబరులో ఈ అంశాలపై అంకురాలతో పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) మాట్లాడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ‘అంకురాలకు పన్ను చెల్లింపుల విషయంలో నిబంధనలను సడలిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిని వచ్చే ఏడాది బడ్జెట్‌లో తీర్చేందుకు ప్రయత్నిద్దాం. అందుకే బడ్జెట్‌లో ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలతో ఒక పూర్తి స్థాయి చర్చా పత్రంతో రమ్మని అంకురాలను కోరుతున్న’ట్లు ఆయన వివరించారు. అంకురాలకు ప్రపంచ స్థాయి ఇసాప్‌ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్‌ వ్యాపారవేత్తలు తమ సొంత కుటుంబ లేదా వ్యాపారాలకు మాత్రమే మార్గదర్శనం వహించకుండా కొత్తతరం, యువ పారిశ్రామికవేత్తలకు సైతం చేయూతనివ్వాలని గోయల్‌ పిలుపునిచ్చారు. ముకేశ్‌ అంబానీ గోరఖ్‌పూర్‌కు వచ్చి యువతను కలిసినా.. ఉదయ్‌ కొటక్‌ తిరుచిరాపల్లిలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలిసినా.. అది స్ఫూర్తిని నింపేదిగా ఉంటుందన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని