కరోనా ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు - states introduces curbs amid rising in covid cases
close
Updated : 18/03/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

ముంబయి/అహ్మదాబాద్‌: దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నట్లే కన్పిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. గుజరాత్‌లోనూ రాత్రి కర్ఫ్యూ వంటి నిబంధనలు తీసుకొచ్చారు. 

మూతబడ్డ పార్కులు.. నిలిచిన బస్సులు

గుజరాత్‌లో గత కొద్దికాలంగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం అక్కడ 1,122 కొత్త కేసులు బయటపడ్డాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. దీంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న అహ్మదాబాద్‌లో పార్కులు మూసివేశారు. అహ్మదాబాద్‌ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌, బస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ సేవలు నిలిపివేయడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. 

మహారాష్ట్రలో జరిమానాలు..

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే అక్కడ 23వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60శాతానికి పైగా ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసే నిబంధనల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని కేంద్ర బృందం నివేదిక ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ విధించింది. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, వివాహ వేడుకలపై పరిమితులు తీసుకొచ్చింది. ముంబయిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన దాదర్‌ హోల్‌సేల్‌ కూరగాయలు, పూల మార్కెట్‌లో కొంత భాగాన్ని మరో చోటకు మార్చేందుకు బీఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నిబంధనలు ఉల్లంఘిచేవారిపై ఠాణే యంత్రాంగం జరిమానాలను విధిస్తోంది. దుకాణాలు, రెస్టారెంట్లు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రూ. 25వేల జరిమానా కట్టాలని హెచ్చరించింది. కస్టమర్లు మాస్క్‌లు సరిగ్గా పెట్టుకోకపోయినా యజమానులకు జరిమానా తప్పదని సూచించింది. 

కంటైన్మెంట్‌ జోన్‌గా మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌

కర్ణాటకలోనూ కరోనా ఉద్ధృతి ఎక్కవగానే ఉంది. ఉడుపిలోని ప్రముఖ మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో గత రెండు రోజుల్లో 52 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ క్యాంపస్‌ను అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. క్యాంపస్‌లోని మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని