covid vaccine: 21.8 కోట్ల డోసులు ఇచ్చాం:కేంద్రం - states to receive 48 lakh vaccine doses
close
Published : 24/05/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

covid vaccine: 21.8 కోట్ల డోసులు ఇచ్చాం:కేంద్రం

దిల్లీ: అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఇప్పటివరకు 21.8 కోట్లకు పైగా కరోనా టీకా డోసులను అందించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంకా 1,80,43,015 డోసులు మిగిలి ఉన్నాయని తెలిపింది. 

‘ఉచితంగా, రాష్ట్రాలు ప్రత్యక్షంగా సేకరించడం ద్వారా ఇప్పటివరకు 21,80,51,890 కోట్ల కరోనా డోసులను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేశాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో 48లక్షలకు పైగా డోసులను అందించనున్నామని తెలిపింది. మరోవైపు, పలు రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు 18-44 మధ్య వయస్కులకు టీకా కార్యక్రమాన్ని నిలిపివేశాయి. ఇప్పటివరకు ఇదే వయస్సు వారికి కోటికి పైగా టీకా డోసులు వేసినట్లు కేంద్రం చెబుతోంది. 

జనవరి 16న ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 19.6 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని