వ్యాక్సినేషన్‌ ఎక్కువ..ఆక్సిజన్‌ అవసరం తక్కువ - states with higher rate of vaccination have lesser requirement of oxygen report
close
Published : 18/05/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సినేషన్‌ ఎక్కువ..ఆక్సిజన్‌ అవసరం తక్కువ

వెల్లడిస్తున్న నివేదికలు

దిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో ఓ వైపు ఆక్సిజన్‌ లభించకపోవడం, మరోవైపు టీకాల కొరతతో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా స్క్రోల్‌ సంస్థ పరిశోధనలో వ్యాక్సిన్‌ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అవసరం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మణిపూర్‌, త్రిపుర రాష్ట్రాలను గమనిస్తే త్రిపుర కన్నా మణిపూర్‌ వాసులకు నాలుగురెట్లు అధిక ఆక్సిజన్‌ అవసరముందని తెలుస్తోంది.  దీనికి కారణం త్రిపురలో వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉండటమే. రాష్ట్రాలు ఎంత ఆక్సిజన్‌ను కోరుతున్నాయన్న వివరాలను ఏప్రిల్‌ 28న కేంద్రం విడుదల చేసింది. ఆ నివేదికల ఆధారంగా వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ అవసరం తక్కువగా ఉందని తెలుస్తోంది.

ఏప్రిల్‌ 28న రాష్ట్రాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కేసులు (1.07లక్షలు), ఛత్తీస్‌గఢ్‌లో (1.15లక్షలు), పశ్చిమబెంగాల్‌లో (1.05లక్షలు) ఉన్నాయి. ఈ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువ కేసులు ఉన్నా వారికి కావాల్సిన ఆక్సిజన్‌ 227 మెట్రిక్‌ టన్నులు. ఇది మిగతా రెండు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్‌-480, పశ్చిమ బెంగాల్‌- 308మెట్రిక్‌ టన్నులు)లతో పోలిస్తే చాలా తక్కువ. దీనికి కారణం ఛత్తీస్‌గఢ్‌లో వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉండటం. మరోవైపు రాజస్థాన్‌లో కూడా కేసులు 1.63లక్షలు ఉండగా వారికి కావాల్సిన ఆక్సిజన్‌ మాత్రం 265 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లో 67శాతం, రాజస్థాన్‌లో 61శాతం 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ను అందించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి విషమించి ఆక్సిజన్‌ అవసరమయ్యే స్థాయి వరకూ  వచ్చే బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో వీలైనంత ఎక్కువ మందికి టీకాలు అందించడం ద్వారా పరిస్థితి విషమించకుండా చూసే అవకాశముందని నిపుణులు అంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని