ప్రముఖ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ కన్నుమూత - still photographer mohan ji is no more
close
Published : 07/05/2021 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రముఖ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌ జీ(86) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. మోహన్‌ జీ అసలు పేరు మాదిరెడ్డి కృష్ణారెడ్డి. 1935లో గుంటూరులో జన్మించిన ఆయన ఫొటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తితో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా మారారు. ఫొటోగ్రఫీలో పూర్తి శిక్షణ తీసుకున్న అనంతరం తన సోదరుడితో కలిసి ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మోహన్ జీ-జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా వర్క్ చేయడం ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘కాడెద్దులు ఎకరం నేల’తో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా మోహన్‌జీ-జగన్‌ జీ  ప్రస్థానం మొదలయ్యింది. అనంతరం ‘అత్తగారు కొత్త కోడలు’, ‘ముహూర్త బలం’, ‘భక్త శబరి’, ‘కొత్తకాపురం’, ‘జగత్‌ కిలాడీలు’, ‘జగత్‌ జెంత్రీలు’, ‘చెల్లెలి కాపురం’, ‘ప్రేమాభిషేకం’.. ఇలా దాదాపు 900 చిత్రాలకు వీరు స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌గా పనిచేశారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ చిత్రాలకు సైతం వీరు స్టిల్స్‌ తీశారు. జగన్‌జీ చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని