తొలి 2 టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టు ఎంపిక - stokes archer return to england team for first two tests against india
close
Published : 22/01/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 తొలి 2 టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టు ఎంపిక

లండన్‌: భారత్‌తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టును ప్రకటించారు. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తిరిగి జట్టులో చేరారు. చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టులకు ఈసీబీ 16 మందితో జట్టును ప్రకటించింది. అంతేకాకుండా మరో ఆరుగురు రిజర్వు ఆటగాళ్లను ఎంపిక చేసింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌... శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలన్న విధానంతో స్టోక్స్‌, ఆర్చర్‌ను లంక సిరీసుకు ఎంపికచేయలేదు. ఇక ఫిట్‌నెస్‌ సాధించిన వెంటనే ఒలీవ్‌ పోప్‌ భారత్‌కు వస్తాడు. గతేడాది సెప్టెంబర్లో పాక్ ‌సిరీస్‌లో అతడి భుజానికి గాయమైంది. లంక పర్యటనలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన మొయిన్‌ అలీ కోలుకొని జట్టులో చేరాడు. బెయిర్‌ స్టో, సామ్‌ కరన్‌, మార్క్‌వుడ్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారిప్పుడు లంకలో ఉన్నారు.

గాలెలో రెండో టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లంతా ఛార్టెడ్‌ విమానంలో చెన్నైకి చేరుకుంటారు. అక్కడ రెండు టెస్టులు ఆడతారు. తర్వాత లక్షా పదివేల సీటింగ్‌ సామర్థ్యమున్న మొతెరాలో రెండు టెస్టులు ఆడతారు. ఇందులో ఒక టెస్టు డే/నైట్‌లో గులాబి బంతితో జరగనుంది. మొత్తంగా టీమ్‌ఇండియాతో ఇంగ్లిష్ జట్టు‌ 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ మొదలవుతుంది. 

ఇంగ్లాండ్‌ జట్టు: జో రూట్‌, జోఫ్రా ఆర్చర్‌, మొయిన్‌ అలీ, జేమ్స్‌ అండర్సన్‌, డామ్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ క్రాలీ, బెన్‌ ఫోక్స్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, బెన్‌స్టోక్స్‌, ఒలీ స్టోన్‌, క్రిస్‌వోక్స్‌

ఇవీ చదవండి
స్పైడర్‌ పంత్‌..!
విశ్రమించను.. విజయం తలకెక్కించుకోను: సిరాజ్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని