China: మేము అమెరికాను ఒక్కటే కోరుతున్నాము...! - stop demonising china change highly misguided mindset: beijing to us
close
Published : 26/07/2021 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

China: మేము అమెరికాను ఒక్కటే కోరుతున్నాము...!

ఇంటర్నెట్‌డెస్క్‌ : చైనాను బూచిగా చూపించి దుష్ప్రచారం చేయడం ఆపాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్‌ అమెరికాను కోరారు. నేడు అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వాన్డీ షెర్మన్‌ చైనాలోని టిన్జెన్‌ నగరానికి వెళ్లారు.  ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఇరు దేశాల మధ్య సైబర్‌ సెక్యూరిటీ నుంచి మానవ హక్కుల పరిరక్షణ వరకు పలు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. 

ఇరువురు మంత్రుల భేటీ సందర్భంగా జీ ఫెంగ్‌ మాట్లాడుతూ ‘‘అమెరికాలోని వ్యవస్థీకృత సమస్యలకు చైనా కారణంగా  చూపిస్తోంది. మేము అమెరికాను ఒక్కటే కోరుతున్నాము. తప్పుదోవ పట్టించే ఆలోచనావిధానాన్ని, ప్రమాదకరమైన పాలసీలను మార్చుకోవాలని అడుగుతున్నాము. చైనాను  శత్రువుగా చూస్తున్నారు ’’ అని పేర్కొన్నారు. 

ఈ పర్యటనలో షెర్మన్‌ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీను కూడా కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని షెర్మన్‌ ట్వీట్‌ చేసి చెప్పారు. తాను ఆదివారం అమెరికా వ్యాపారాలకు  చైనాలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. 

ఈ పర్యటనకు ముందే ఇరు దేశాల మధ్య అగ్గి రాజుకొంది. గత వారం ఈ చర్చలపై అమెరికా స్పందిస్తూ.. చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగు పర్చుకోవాలి. సంబంధాలు దెబ్బతిని వివాదం ముదరకుండా చూసుకోవాలని హితవు పలికింది. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని