నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు.. - stopped for no masks delhi couple abuses cops video viral
close
Updated : 19/04/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..

మాస్క్‌ పెట్టుకోలేదని అడ్డుకున్న పోలీసులపై దురుసు ప్రవర్తన 

దిల్లీ: కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ దిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొందరు వాటిని ఉల్లంఘిస్తూ రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ప్రతిఒక్కరూ రెండు మాస్క్‌లు పెట్టుకుంటే సురక్షితమని శాస్త్రవేత్తలు చెబుతున్నా కనీసం ఒక్క మాస్క్‌ కూడా పెట్టుకోకుండా వీధుల్లో తిరిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ పెట్టుకోకుండా కారులో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులపైనే ఓ జంట ఎదురుదాడికి దిగిన ఘటన దిల్లీలోఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంకజ్‌ దత్త, అభా అనే దంపతులు కారులో వెళ్తూ మాస్క్‌ ధరించలేదు. దీంతో పోలీసులు అడ్డుకోగా.. వారితో దురుసుగా ప్రవర్తించారు. చలానా జారీ చేస్తున్న పోలీసులను ‘బెగ్గర్స్‌’ అంటూ మహిళ దూషించిన  వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన దిల్లీలోని దర్యాగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

దిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ అమలులో ఉండటంతో కేవలం అత్యవసర సర్వీసులనే అనుమతిస్తున్నారు. ఈ-పాస్‌లు తీసుకున్నవారిని మాత్రమే బయటకు వదులుతున్నారు. అయితే, అలాంటి నిబంధనలేమీ పాటించకుండా బయటకు వచ్చిన ఈ  దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్‌ పెట్టుకోలేదెందుకని ప్రశ్నించడంతో పోలీసులపై ఆ మహిళ కారులోంచే గట్టిగా కేకలు వేయడంతో  కొన్ని నిమిషాల పాటు వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక దశలో నా భర్తను ముద్దుపెట్టకుంటాను.. ఏం చేస్తారు అని అనడంతో పోలీసులు నివ్వెరపోయారు. దంపతుల వీరంగంతో  ప్రధాన రహదారిపై  ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  కరోనా లాంటివేమీ లేవని, కారణం లేకుండా ప్రజల్ని వేధిస్తున్నారంటూ ఆ మహిళ పోలీసులపై విరుచుకుపడింది. దీంతో  మహిళా కానిస్టేబుళ్లను రప్పించిన పోలీసులు ఆ దంపతులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కొద్ది రోజుల క్రితం మాస్క్‌లు ధరించడంపై దిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కారులో ఒక్కరు ఉన్నా కూడా మాస్క్‌ ధరించాలని పేర్కొంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని