తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం! - story on thippatheega booster of immunity power
close
Updated : 21/04/2021 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!

రోగనిరోధకశక్తిని పెంచుతుందంటున్న ఆయుర్వేద వైద్యులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిప్పతీగ.. పల్లెల్లో ఎక్కువగా చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కరోనా పంజా విసురుతున్న వేళ కచ్చితంగా తెలుసుకొని తీరాలి. తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలిసిఉండదు. కానీ ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో దీనిగురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలీకాయ అంత ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు ఢంకా బజాయించి మరీ పేర్కొంటున్నారు. ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను ‘శంశమినివటి’ అనే పేరుతో మందులుగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరిస్తున్నారు. 

తిప్పతీగ ఆకుల్లోనే కాదు.. కాడల్లోనూ వైద్య గుణాలు ఉన్నాయి. కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ తిప్పతీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్‌ తీగలు సహా ఎక్కడైనా పాకుతూ పోతూఉంటుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని