మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌? - strict lockdown likely in maharashtra
close
Published : 21/04/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?

10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం
లాక్‌డౌన్‌పై బుధవారం ప్రకటన

ముంబయి: కరోనా ధాటికి వణికిపోతోన్న మహారాష్ట్ర ఇక కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేబినెట్‌.. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేసేందుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే కఠిన ఆంక్షలపై మాత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ప్రకటన చేస్తారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

‘‘కరోనా వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేందుకు పలు చర్యలు చేపట్టాం. ముఖ్యంగా పవర్‌ప్లాంట్లు తయారు చేసే ఆక్సిజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించాం’’ అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్ వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్‌, వారాంతంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ చాలా మంది ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు మంత్రులందరూ మొగ్గుచూపారని రాజేష్ తోప్‌ పేర్కొన్నారు. ఈ కఠినమైన ఆంక్షలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ లభ్యతపై ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్‌ స్పందించారు. నిత్యం 1550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిర్వహణను చేపట్టామన్నారు. ప్రతి జిల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాలకు అంబులెన్స్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వెల్లడించారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌కు మహారాష్ట్ర విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా అక్కడ నిత్యం 50వేలకు పైగా కొత్తగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం 62,097 కరోనా కేసులు నమోదు కాగా, 519 మంది మృతిచెందారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని