రామ్‌చరణ్, శంకర్‌ చిత్రంలో సుదీప్? - sudeep in ramacharan shankars film
close
Published : 01/05/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌చరణ్, శంకర్‌ చిత్రంలో సుదీప్?

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌తో పాటు, తమిళ, కన్నడ చిత్రసీమకు చెందిన నటుల్ని ఇందులో నటింపజేయడానికి నిర్మాణ సంస్థ ఆసక్తి కనబరుస్తోందని సమాచారం.

‘ఆర్‌సి 15’వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. సుదీప్‌ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. తర్వాత ‘బాహుబలి’లోనూ అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇక చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అవుకు రాజుగా కనిపించారు. కిచ్చా సుదీప్‌ ప్రస్తుతం ‘విక్రాంత్‌ రోనా’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఉపేంద్ర  హీరోగా నటిస్తున్న ‘కబ్జా’ చిత్రంలో భార్గవ్‌ బక్షిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని