‘విక్రాంత్‌ రానా’.. హంగామా - sudeep to enter dubbing studio for vikrant rona next week
close
Published : 21/06/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విక్రాంత్‌ రానా’.. హంగామా

బెంగళూరు: విలక్షణమైన పాత్రలతో అలరిస్తూ.. నటుడిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిచ్చ సుదీప్‌.  ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రానా’. అనూప్‌ బండారి దర్శకుడు. మంజునాథ్‌ గౌడ నిర్మిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే వారం నుంచి కిచ్చ సుదీప్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ పనులు పూర్తికాగానే చిత్ర బృందం.. విడుదల తేదీపై ఓ స్పష్టత ఇవ్వనుంది. సందీప్‌ నటిస్తున్న 25వ చిత్రమిది. విభిన్నమైన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 3డీలో రూపొందుతోంది. ఈ సినిమా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని