సుధీర్‌తో కలిసి అదరగొట్టిన అలనాటి డ్యాన్సర్లు - sudheer special dance performance sridevi drama company
close
Published : 05/05/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుధీర్‌తో కలిసి అదరగొట్టిన అలనాటి డ్యాన్సర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: వారంతా ఒకప్పటి డ్యాన్సర్లు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు ఇలా అలనాటి తారలతో కలిసి స్టెప్‌లు వేసినవాళ్లు. అందరికీ 60ఏళ్లకు ఏమాత్రం తక్కువ ఉండవు. ఈ వయసులోనూ తమదైన స్టెప్‌లతో అదరగొట్టి, ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో అలనాటి డ్యాన్సర్లు వ్యాఖ్యత, నటుడు సుధీర్‌తో కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి పాటకు స్టెప్‌లు వేశారు. చిరు నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలోని ‘లాహే.. లాహే’ పాటతో బుల్లితెరను షేక్‌ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను చూసిన వారందరూ కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆద్యంతం అలరించేలా సాగిన ఈ పాటను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని