సందీప్‌ ఆట సుమ మాట - suma and viva harsha special appearance in a1 express
close
Published : 27/02/2021 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందీప్‌ ఆట సుమ మాట

హైదరాబాద్‌: సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావణ్య త్రిపాఠి నాయిక. డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌కిషన్‌, దయా పన్నెం నిర్మాతలు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

హాకీ నేపథ్యంలో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిదే. ఆటకు సంబంధించిన సన్నివేశాలను ‘చక్‌దే ఇండియా’ చిత్రీకరణ జరిపిన మొహాలీ స్టేడియంలోనే తెరకెక్కించారు. ఇందులో ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల వ్యాఖ్యానంతో మ్యాచ్‌ సాగుతుందని చిత్రబృందం తెలిపింది. వైవా హర్ష మరో వ్యాఖ్యాతగా కనిపిస్తారు. ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని