MAA Election: లోకల్‌ నాన్‌లోకల్‌పై సుమన్‌ వ్యాఖ్యలు - suman indirectly supports prakash raj in maa election
close
Updated : 01/07/2021 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: లోకల్‌ నాన్‌లోకల్‌పై సుమన్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని తెలుగు సినీ నటుడు సుమన్‌ వ్యాఖ్యానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి స్పందించారు. ‘మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన లోకల్‌ నాన్‌లోకల్‌పై పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్‌ కిందే లెక్కని.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని ఆయన తెలిపారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

మరో కొన్ని నెలల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రోజురోజుకీ ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. దీంతో, ఈ ఏడాది ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారా? అని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని