sumanth: రెండో వివాహంపై స్పందించిన నటుడు సుమంత్‌ - sumanth clarification about second marriage rumours
close
Published : 29/07/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

sumanth: రెండో వివాహంపై స్పందించిన నటుడు సుమంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నటుడు సుమంత్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సుమంత్‌ వెడ్స్‌ పవిత్ర పేరుతో ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక గత 24గంటలుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ పెళ్లి కార్డును చూసి చాలామంది సుమంత్‌ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ భావించారు. ఈ క్రమంలో సుమంత్‌ రెండో పెళ్లి పేరుతో వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలోనూ భిన్నరకాలుగా పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ విషయమై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కూడా ట్వీట్‌ చేశారు. తాజాగా.. సుమంత్‌ స్పందించారు. 

‘అందరికీ నమస్తే.. ఈ మధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నిజ జీవితంలో నేను పెళ్లి చేసుకోవడం లేదు. విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాంటి కథతో ఓ సినిమా రావడంతో  తెలుగులో ఇదే తొలిసారి. సినిమా చిత్రీకరణ సందర్భంగా ఆ సినిమాలోని ఓ వెడ్డింగ్‌ కార్డు బయటికి వచ్చింది. అదే అపార్థాలకు దారి తీసింది’’ అని సుమంత్‌ పేర్కొన్నారు. 

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ’ చిత్రంతో సుమంత్‌ తన సినిమా కెరీర్‌ ప్రారంభించారు. 2003లో సుమంత్‌ హీరోగా వచ్చిన ‘సత్యం’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘గౌరీ’, ‘ధన 51’, ‘మహానంది’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సుమంత్‌ నటించిన ‘గోదావరి’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మంచి కథా బలమున్న సినిమాలు ఎంచుకుంటూ సాగిపోతున్నారు. ఇటీవల సుమంత్‌ నటించిన ‘కపటధారి’ విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం నూతన డైరెక్టర్‌ కీర్తికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని