ఈసారి మనమే కప్పుకొడుతున్నాం! - sundeep kishan a1 express official trailer
close
Updated : 26/01/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసారి మనమే కప్పుకొడుతున్నాం!

ఆసక్తికరంగా ఏ1 ఎక్స్‌ప్రెస్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘మన దేశంలో స్పోర్ట్స్‌మెన్‌కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు సర్‌. ఇక్కడ స్పోర్ట్స్‌ బిజినెస్‌ అయి చాలా కాలం అయింది. ఏ స్పోర్ట్స్‌ చూడాలో.. ఏది చూడకూడదో బిజినెస్‌మెన్‌ నిర్ణయిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందీప్‌ కిషన్‌. జీవన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ  చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌, లావణ్యలు హాకీ ప్లేయర్లుగా కనిపించారు. మరి హాకీ ఆడేందుకు వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని అధిగమించి ఎలాంటి విజయాలను నమోదు చేశారన్న విషయాలు తెలియాంటే సినిమా చూడాల్సిందే! ‘ఈ చారిత్రాత్మక ఆట సాక్షిగా ఈసారి కప్పు మనమే కొడుతున్నాం’ అంటూ రావు రమేశ్‌ సంభాషణలు ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్‌లలో విడుదల చేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని