రాహుల్‌ ఫామ్‌ లేమి..భారత్‌కు కలిసొచ్చింది - sunil gavaska feels kl rahuls loss of form may be blessing for team india as they got new opening pair
close
Updated : 21/03/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాహుల్‌ ఫామ్‌ లేమి..భారత్‌కు కలిసొచ్చింది

ఇంటర్నెట్‌డెస్క్‌: టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం ఒక విధంగా టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌(64), కోహ్లీ(80*) అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించి శుభారంభం చేశారు. దీంతో ఈ మేటి బ్యాట్స్‌మెన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన గావస్కర్‌.. ఈ కొత్త ఓపెనింగ్‌ జోడీ ఇలాగే కొనసాగాలని ఆశించాడు.

‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అధిక ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలి. విరాట్‌ కోహ్లీ కూడా ఇలాగే ఓపెనింగ్‌ చేసి బ్యాటింగ్‌ చేయాలి. రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం ఒక విధంగా టీమ్‌ఇండియాకు కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త జోడీ భవిష్యత్‌పై ఆశలు పెట్టుకునేలా చేసింది. సచిన్‌ కూడా మొదట్లో మిడిల్‌ఆర్డర్‌లో ఆడేవాడు. అతడిని ఓపెనింగ్‌లో పంపించగానే టీమ్‌ఇండియా రూపురేఖలే మారిపోయాయి. అది అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదే కాకుండా జట్టు మొత్తంపైనే ప్రభావం చూపింది. కాబట్టి, బాగా ఆడేవారిని ముందుగా బ్యాటింగ్‌కు పంపాలి. రోహిత్‌, కోహ్లీ జోడీని ఇలాగే కొనసాగించాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

కాగా, రాహుల్‌ ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నుంచి ఆడినా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టీ20లో ఒక్క పరుగు చేసిన అతడు తర్వాత 0, 0, 14 పరుగులు చేశాడు. దీంతో ఫామ్‌ కోల్పోయి సతమతమౌతున్న అతడిని టీమ్‌ఇండియా చివరి మ్యాచ్‌లో పక్కకుపెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్‌ చేశాడు. దాంతో వారిద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈ కొత్త ప్రయోగం బాగా పనిచేయడంతో కోహ్లీ సైతం రోహిత్‌తో మళ్లీ ఓపెనింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు. దీంతో అభిమానులు సైతం భవిష్యత్‌లో వీరిద్దరూ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని