గిల్‌కు 21 ఏళ్లే.. ప్రశాంతంగా ఉండాలి: గావస్కర్‌ - sunil gavaskar backs shubhman gill for ipl failure
close
Published : 09/05/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిల్‌కు 21 ఏళ్లే.. ప్రశాంతంగా ఉండాలి: గావస్కర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన అతడు ఈసారి టోర్నీ వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 పరుగులే చేశాడు. దాంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

‘గిల్‌ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాల పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్‌ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కారణంగానే ఇలా విఫలమవుతున్నాడని అనిపిస్తోంది. అతడిప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా 21 ఏళ్ల కుర్రాడే. ఎవరికైనా వైఫల్యాలు ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాలి. అతడు ఓపెనింగ్‌ చేస్తూ దేని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాల్సి ఉంది. సహజసిద్ధమైన ఆట ఆడితే పరుగులవే వస్తాయి’ అని గావస్కర్‌ వివరించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని