సన్నీ లియోనీని విచారించిన కేరళ పోలీసులు - sunny leone accused of financial fraud records statement with kerala crime branch
close
Published : 07/02/2021 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్నీ లియోనీని విచారించిన కేరళ పోలీసులు

తిరువనంతపురం: బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని కేరళ పోలీసులు విచారించారు. ఆర్థికనేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని నమ్మించి రూ.29 లక్షలు సన్నీ అక్రమంగా తీసుకున్నారంటూ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో కేసు విచారణ చేపట్టిన పోలీసులు సన్నీని విచారించారు. ఓ టెలివిజన్‌ షో నిమిత్తంగా తిరువనంతపురం జిల్లా పూవురుకు వచ్చిన ఆమెను ప్రశ్నించారు. రెండు కార్యక్రమాల్లో సన్నీ పాల్గొంటానని చెప్పి తన నుంచి రూ.29లక్షలు తీసుకుని ఆ తర్వాత మొహం చాటేశారని షియాస్‌ ఆరోపించాడు. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు.

ఇదీ చదవండి..

రూటు మార్చిన రామ్‌.. ‘స్టార్‌ మహిళ’లకు థ్యాంక్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని