Cinema News: నెట్టింట్లో సన్నీలియోనీ పిక్‌ వైరల్‌.. - sunny leone shot is setting the internet ablaze
close
Published : 14/06/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నెట్టింట్లో సన్నీలియోనీ పిక్‌ వైరల్‌..

తారల స్టన్నింగ్‌ లుక్స్‌తో డబూ రత్నానీ ఫొటోషూట్‌

ముంబయి: ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ.. మరోసారి తన కెమెరాతో నెటిజన్లను ఫిదా చేశారు. ‘డబూ రత్నానీ క్యాలెండర్‌’ పేరుతో ఆయన ప్రతి ఏటా సెలబ్రిటీ ఫొటోలతో స్పెషల్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం విదితమే. బాలీవుడ్‌కు చెందిన విద్యాబాలన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, సన్నీలియోనీ, ఆలియాభట్‌, శ్రద్ధాకపూర్‌, హృతిక్‌రోషన్‌ వంటి స్టార్ల స్టన్నింగ్‌ లుక్స్‌తో ఈ ఏడాది క్యాలెండర్‌ సిద్ధమైంది.

త్వరలో ఆవిష్కృతం కానున్న క్యాలెండర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు ఆకట్టుకోగా.. విద్యాబాలన్‌, సన్నీలియోనీ కిల్లింగ్‌ లుక్స్‌ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, బీటౌన్‌ బ్యూటీ తారా సుతారియా మొదటిసారి ఈ క్యాలెండర్‌లో భాగమయ్యారు. మరి, రౌడీ లుక్స్‌ ఎలా ఉంటాయో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని