Pawan kalyan: పవన్‌ వదులుకున్న బ్లాక్‌ బస్టర్ చిత్రాలివే! - super hit movies rejected by power star pawan kalyan
close
Published : 03/09/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan kalyan: పవన్‌ వదులుకున్న బ్లాక్‌ బస్టర్ చిత్రాలివే!

‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ లాంటి బాక్సాఫీసు బద్దలైన హిట్‌లు ఇచ్చిన హీరో పవన్‌ కల్యాణ్‌. హిట్లతో పాటే, ఎప్పటికప్పుడు ట్రెండ్‌సెట్‌ చేస్తూ వెళ్లే కథానాయకుడు ఆయన. అయితే, అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలను ఆయన వదులుకోవాల్సి వచ్చింది. అవి కూడా పవన్‌కల్యాణ్ చేసి ఉంటే.. ఆయన స్టామినా ఊహలకు కూడా అందేది కాదు. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆసక్తికర సినిమాలేంటో చూసేయండి!

పూరితో నాలుగు సినిమాలు

‘బద్రి’తో తెలుగులో అడుగుపెట్టిన డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఆ తర్వాత ‘ఇట్లు శ్రావణి.. సుబ్రహ్మణ్యం’ కథ వినిపించారు. అయితే, ఎందుకో ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత  ‘ఇడియట్‌’ కథను పవన్‌కు వినిపించారు. స్క్రిప్ట్‌ బాగుందని చెప్పిన ఎందుకో సినిమా చేయలేదు. ఆ తర్వాత ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’  స్క్రిప్ట్‌ కూడా వినిపించారు. అది కూడా ఎందుకో పట్టాలెక్కలేదు. ఎలాగైనా పవన్‌తో సినిమా చేయాలని మళ్లీ ‘పోకిరి’ కథను వినిపించారు. ఈ సారి కూడా పవన్‌ నుంచి తిరస్కారమే ఎదురైంది.  పవన్‌ వదిలేసిన చిత్రాలతో రవితేజ స్టార్‌ హీరోగా మారిపోతే, మహేశ్‌ ‘పోకిరి’ని కెరీర్‌ బెస్ట్‌ చిత్రం అయింది.


అతడు కూడా ఆయనదే!

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌ అనిపించుకొంది త్రివిక్రమ్‌, పవన్‌ల ద్వయం. అయితే జల్సా కన్నా ముందే  వీరిద్దరూ కలిసి పనిచేయాల్సింది.  త్రివిక్రమ్‌ ‘అతడు’ ముందుగా పవన్‌కే వినిపించారు. కథ చెబుతున్న సమయంలో పవన్‌ నిద్రపోవడటంతో ఆయనకు ఆసక్తిలేదేమోనని త్రివిక్రమ్‌ ఆ కథను మహేశ్‌కు వినిపించి హిట్టుకొట్టారు.


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌ కలిసి ‘గోపాల గోపాల’ మల్టీస్టారర్‌ చిత్రాన్ని టాలీవుడ్‌కు అందించారు.  దిల్‌రాజ్‌ తెలుగులో భారీ మల్టీస్టారర్‌ తీయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా పవన్‌ కల్యాణ్‌నే సంప్రదించారు. అప్పుడు వినిపించిన కథే  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.  పవన్‌ వదులుకోవడంతో ఆ చిత్రం మహేశ్‌ను చేరింది. చిన్నోడిగా మహేశ్‌, పెద్దోడిగా వెంకటేశ్‌ నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకన్నారు.  


మిరపకాయ్‌ 

‘గబ్బర్‌సింగ్‌’తో పవన్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఆయన తీసిన ‘మిరపకాయ్‌’ కథను  ముందుగా విన్నది పవర్‌ స్టారే.  కొన్ని కారణాల వల్ల పవన్‌ చేయకపోవడంతో రవితేజతో  చేశారు హరీష్‌ శంకర్‌.  రవితేజ కెరీర్‌లో మిరపకాయ్‌ మంచి హిట్‌ గా నిలిచింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని