Krishna: సాహసాల సూపర్‌స్టార్‌కు శుభాకాంక్షలు  - superstar krishna happy birthday wishes
close
Published : 31/05/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Krishna: సాహసాల సూపర్‌స్టార్‌కు శుభాకాంక్షలు 

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటశేఖరుడు. విప్లవవీరుడు, మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా నటించి యావత్‌ తెలుగుప్రేక్షకుల్ని మెప్పించారు. తొలి కౌబాయ్ చిత్రంగా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’ సినిమాలు చేశారు. ఇంకా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.   

‘‘తెలుగు సినిమా పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా రాణించి.. సూపర్‌స్టార్‌గా, మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందిన ఘట్టమనేని కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ప్రశాంతతను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను’’ - నారా చంద్రబాబునాయుడు.

‘‘సాహసానికి మారుపేరు, మల్లెపువ్వులాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ - చిరంజీవి 

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..  ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి నాకు మంచి మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు ..  మీద ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ’’  - మహేష్‌బాబు 

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. మీది ఎంతో విశాల హృదయం. మీరు నా హీరో. నా జీవితంపై గొప్ప ప్రభావం చూపారు. నా రోల్ మోడల్, మిమ్మల్ని ఎంతో  ప్రేమిస్తున్నా’’ - మంజుల ఘట్టమనేని

‘‘ఆయనే అసలైన ‘కౌబాయ్’, ‘మోసగాడు’. ఆయనే  ధైర్యవంతుడైన సీతారామరాజు.  కానీ మీరే నాకు అసలైన.. ‘గూఢచారి 116’. మీరే నిజమైన ట్రెండ్ సెట్టర్. ది లెజెండ్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు’’  - అడివి శేష్‌

‘‘సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిరంతరం అభిరుచి, అంకితభావంతో తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచిన వ్యక్తి మీరు’’ - దర్శకుడు హరీష్‌ శంకర్‌.  








మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని