మహేశ్‌ అన్న మీరు జాగ్రత్త!   - superstar fans trends staysafemaheshanna
close
Updated : 24/04/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ అన్న మీరు జాగ్రత్త! 

హోమ్‌ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ

హైదరాబాద్‌: ‘మహేశ్‌ అన్న మీరు జాగ్రత్తగా ఉండండి’ అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులు. వ్యక్తిగత స్టైలిస్ట్‌ కరోనా బారిన పడడంతో మహేశ్ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నిరోజుల నుంచి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సూపర్‌స్టార్‌ అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, నెటిజన్లు నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. #StaySafeMaheshAnna అనే హ్యాష్‌ట్యాగ్‌ని జతచేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ పొడవాటి జుట్టుతో యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ఉద్ధృతంగా ఉన్న కారణంగా ‘సర్కారువారి పాట’ షూట్‌ను కొంతకాలం వాయిదా వేసినట్లు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని