రజనీ గురించి అనుచరుడి ఆసక్తికర వ్యాఖ్యలు - superstars associate plans his return to politics
close
Published : 04/02/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ గురించి అనుచరుడి ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తానెప్పటికీ రాజకీయాల్లోకి రాలేనని చెప్పలేదని ఆయన అనుచరుడు తమిళారువి మణియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతానికి ఎన్నికల బరిలోకి దిగబోనని మాత్రమేనని అన్నారని వివరించారు. రజనీ మక్కల్ మండ్రమ్‌(ఆర్‌ఎంఎం)ను కూడా రజనీ రద్దు చేయలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మణియన్ గాంధీయ మక్కల్ ఇయక్కమ్ వ్యవస్థాపకులు.

‘భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని రజనీ చెప్తే..గాంధీయ మక్కల్‌ ఇయక్కమ్ ఆయనతో పాటు కొనసాగుతుంది. ఒకవేళ ఆయన రాకపోతే.. ఒక అనుబంధ సంస్థగా ముందుకెళ్తుంది. ఆర్‌ఎంఎంను బలహీన పర్చాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఇతర పార్టీల్లో చేరారు. ఈ సమయంలో పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ మార్చి ఏడున తిర్పూర్‌లో జరగనుంది’ అని మణియన్ మీడియాతో మాట్లాడారు. 

అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టడం లేదని, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తానని డిసెంబర్‌లో రజనీకాంత్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులను ఆయన కోరారు. ఈ క్రమంలోనే మణియన్ తాజాగా మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇవీ చదవండి:

అభిమానులారా..నన్ను బాధపెట్టొద్దు: రజనీ

పార్టీపై రజనీకాంత్ సంచలన ప్రకటన

 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని