అందరికీ వ్యాక్సిన్‌ అందాలని ప్రార్థించండి: జస్టిస్‌ - supreme court judge said pray to god that vaccination for everyone is done
close
Updated : 01/06/2021 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరికీ వ్యాక్సిన్‌ అందాలని ప్రార్థించండి: జస్టిస్‌

దిల్లీ: ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్‌ అందాలని దేవుణ్ని ప్రార్థించాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఓ కేసులో నిందితులకు బెయిల్‌పై వర్చువల్‌ విచారణ జరుపుతుండగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలకు జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమైందంటే.. 

కరోనా.. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణలు గతేడాది మార్చి నుంచి వర్చువల్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ‘‘ఆగస్టు నుంచి అయినా ప్రత్యక్ష విచారణ జరిగేలా చూడమని దేవుణ్ని ప్రార్థిద్దాం’’ అని అన్నారు. వెంటనే జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ‘‘ఎంత వీలైతే అంత తొందరగా ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందేలా చూడమని దేవుణ్ని ప్రార్థించాలి’’ అని సూచించారు. అందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడే ప్రత్యక్ష విచారణ జరిగే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. 

కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, కొవిడ్‌ నిర్వహణపై సుమోటో కేసును విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ కూడా ఉన్నారు. సోమవారం జరిగిన విచారణలో టీకా విధానం, సేకరణ, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. సంబంధిత వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని