న్యాయవ్యవస్థలో ఉన్నవారికీ కొవిడ్‌ టీకా.. - supreme issues notices to centre over vaccination to judiciary members
close
Published : 16/02/2021 21:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయవ్యవస్థలో ఉన్నవారికీ కొవిడ్‌ టీకా..

దిల్లీ: కొవిడ్‌ టీకా పంపిణీలో న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థలో భాగమైన వారందరికీ ప్రాధాన్యం ఇవ్వాలనే అభ్యర్థన సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ విషయమై స్పందించాల్సింగా సర్వోన్నత న్యాయస్థానం నేడు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు అరవింద్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వాజ్యాన్ని (పిల్‌) దాఖలు చేశారు. ప్రభుత్వం పోలీసు, వైద్యారోగ్య, భద్రతా, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రాధాన్యత కల్పించిందని.. ఐతే ఆయా విభాగాలన్నీ చివరకు న్యాయవ్యవస్థ వద్దకే వస్తాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో అంతర్భాగమైన వారందరికీ టీకా ఇచ్చే విషయంలో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసు ఇచ్చిన సుప్రీం బెంచ్‌.. రెండువారాల అనంతరం దీనిపై వాదనలు వింటామని వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని